సైకత కళ భళా
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

సైకత కళ భళా

అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న యువకుడు

ఈటీవీ, విజయవాడ


బుద్ధుడి సైకత రూపం

 

పుడమి తల్లిని ప్రేమించే మనస్తత్వం ఆ యువకుడిది.. చిన్నతనం నుంచే బొమ్మలు వేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతో మొదలు పెట్టిన చిత్రకళ.. అద్భుత సైకత శిల్పాలు రూపకల్పన చేసే దిశగా మారింది.. చిత్రకళనే శ్వాసగా భావించిన ఆ యువకుడే విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్‌.. తన కళతో చిత్రాలకు ప్రాణం పోస్తున్న ఆయన ఉడెన్‌ ఆర్ట్స్‌, పెన్సిల్‌ ఆర్ట్స్‌, సైకత శిల్పాలు వేయడంలో విశేష ప్రతిభ గడించారు. ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటీల్లో నెగ్గారు. తాజాగా జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాందించారు.

కళపై మక్కువ, అందులో రాణించాలన్న ఆశయం.. ఆ యువకుడిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాయి. పాఠశాల స్థాయి నుంచే పెన్సిల్‌ ఆర్ట్‌, ఇసుకతో సైకత శిల్పాలు చేయడంలో మెలుకువలు నేర్చించిన బాలాజీ వర ప్రసాద్‌... తాత నుంచి వారసత్వంగా ఈ విద్య తీసుకున్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తూ తనదైన శైలిలో ఇసులో కళాత్మకంగా బొమ్మలు గీస్తున్నారు. సబ్బు బిల్ల, అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్లు, సబ్బు బిల్లపై కూడా బాపు బొమ్మ గీసి తన చిత్రకళలోని ప్రతిభని చాటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా కళాఖండాలు నిర్మిస్తూ బాలాజీ అందరి ప్రశంసలు పొందుతున్నారు. మొదట పాఠశాల స్థాయి నుంచి చిత్రాలు గీయడంలో ఆసక్తి కనబరిచిన బాలజీ... ఆ కళని తన చేతిలో బంధించుకొని ముందుకు సాగుతున్నారు.


చిత్ర కళ...

ఎంబీఏ అనంతరం ఐదు అంకెల జీతాన్ని సైతం త్యజించి, కళ కోసం ప్రాణం పెట్టి ఒడిశా ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ శాండ్‌ ఆర్ట్‌ 2018 పోటీల్లో మొదటి స్థానం సాధించి తన కళకు సార్థకత పొందారు. తాను నమ్ముకున్న కళనే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెబుతున్నారు. తన ప్రతిభని గుర్తించి జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.


360కు పైగా పోటీల్లో...

ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 360కి పైగా సైకత శిల్పాల పోటీల్లో పాల్గొన్నాను. ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా తన సైకిత శిల్పాలకు మొదటి, రెండో స్థానం వస్తుంది. గత ప్రభుత్వం ఉగాది విశిష్ఠ పురస్కారంతో సత్కరించింది. అయితే వందల సంఖ్యలో అవార్డులు రావడం సంతోషంగా ఉన్నా ప్రస్తుత తరుణంలో కళలకి ప్రాధాన్యం తగ్గిపోతోంది. గత ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రస్తుతం లేదనే చెప్పాలి. ప్రభుత్వం అవకాశం ఇస్తే అరుదైన ఇలాంటి సైకత శిల్పాల కళని మరింత మంది విద్యార్థులకు బోధించేందుకు సిద్ధంగా ఉన్నాను.

-బాలాజీ వరప్రసాద్‌, సైకత శిల్పి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని