అక్రమ తవ్వకాలపై రూ.37 వేల జరిమానా
eenadu telugu news
Published : 21/09/2021 03:17 IST

అక్రమ తవ్వకాలపై రూ.37 వేల జరిమానా

తాడికొండ, న్యూస్‌టుడే: మండలంలోని లాం గ్రామంలో సోమవారం సాయంత్రం మైనింగ్‌ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలపై కన్నెర్ర చేశారు. అనుమతులు లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్న ఐదు వాహనాలను సీజ్‌ చేసి రూ.37 వేలు జరిమానా విధించారు. ఈనెల 18న ‘ఆగని అక్రమ తవ్వకాలు’ శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మైనింగ్‌ శాఖ అధికారులు లాం గ్రామానికి వెళ్లి కొండను పరిశీలించారు. మైనింగ్‌ బిల్లులు లేకుండా తవ్వకాలు జరిపి మట్టిని తరలిస్తున్న ఒక టిప్పరు లారీ, పొక్లెయిన్‌, మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఎంతటివారైనా అక్రమ తవక్వాలు చేపడితే కరిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని