వాణిజ్య ఉత్సవ్‌ విజయవంతం చేయాలి
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

వాణిజ్య ఉత్సవ్‌ విజయవంతం చేయాలి


ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌, సీపీ శ్రీనివాసులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: వాణిజ్య ఉత్పత్తులను మెరుగుపరిచి ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్‌ - 2021ను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్‌ జె.నివాస్‌, సీపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. వాణిజ్య ఉత్సవ్‌- 2021ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఉత్సవ్‌లో దుబాయ్‌, లండన్‌, ఫ్రాన్స్‌, బంగ్లాదేశ్‌, పశ్చిమ జర్మనీ తదితర దేశాల రాయబారులతో పాటు 100మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు 2030 నాటికి వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతిని 10శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వాణిజ్య ఉత్సవ్‌లో ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఎక్స్‌పోర్టు యాక్షన్‌ ప్లాన్‌ను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. అనంతరం ఎక్స్‌పోర్టు ట్రేడ్‌ పోర్టల్‌ను, వైఎస్సార్‌ వన్‌ బిజినెస్‌ అడ్డయిజరీ సర్వీసెస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ హాలులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నివాస్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం, నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం సమీక్షించారు. ఉత్సవ్‌లో పాల్గొనే స్టాళ్ల నిర్వాహకులను తనిఖీ చేసి ముందుగానే వారి స్టాళ్లలో ఉండేవిధంగా చూడాలని సీపీ అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని