టెన్నిస్‌ సాధనతో దేహదారుఢ్యం
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

టెన్నిస్‌ సాధనతో దేహదారుఢ్యం


రాకెట్‌తో ఆడి టోర్నీ ప్రారంభించిన నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: టెన్నిస్‌ సాధన ద్వారా దేహదారుఢ్యం పెంపొందడంతో పాటు మానసిక వికాసం కూడా కలుగుతుందని నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు అన్నారు. జిల్లా టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్థానిక ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలోని టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీని సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మన దేశంలో చిన్నారుల తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు కూడా సత్తా చాటుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడు టి.రాధాకృష్ణమూర్తి అధ్యక్షత వహించగా.. ప్రాయోజకులు శాంతి నర్సింగ్‌ హోమ్‌ డాక్టర్‌ ఎస్‌.రామకృష్ణ గౌరవ అతిథిగా, జిల్లా టెన్నిస్‌ సంఘం గౌరవ ఉపాధ్యక్షుడు సీబీఎస్‌ వరప్రసాద్‌, సభ్యుడు మల్లికార్జునరావు, టోర్నీ డైరెక్టర్‌ వై.శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

తొలి రోజు ఫలితాలు ఇలా..

* అండర్‌-10 బాలుర విభాగంలో జి.మోక్షిత్‌ వెంకట్‌(నరసరావుపేట), కె.విన్సెంట్‌ (గుంటూరు)లు ఫైనల్‌లో ప్రవేశించారు.

* అండర్‌-10 బాలికల విభాగంలో బి.భవానీదేవి, ఎం.అశ్విని (గిద్దలూరు)లు ఫైనల్‌కు చేరుకున్నారు.

* అండర్‌-12 బాలుర విభాగంలో వై.ఇషాన్‌ (విజయవాడ), ఎ.గౌతమ్‌ (విశాఖ)లు ఫైనల్‌కు ప్రవేశించారు.

* అండర్‌-14 బాలుర విభాగంలో ఎం.సుథన్వ్‌ రవినందన్‌ (నెల్లూరు), వై.ఇషాన్‌ (విజయవాడ)లు ఫైనల్స్‌కు చేరుకున్నారు.

* అండర్‌-14 బాలికల విభాగంలో జి.జోషిత (గుంటూరు), ఎ.కీర్తన (కాకినాడ)లు ఫైనల్స్‌లో ప్రవేశించారు.

* అండర్‌-16 బాలుర విభాగంలో జి.బాలమనోజ్‌ (గుంటూరు), వి.ఆనంద్‌రెడ్డి(విజయవాడ)లు ఫైనల్‌కు చేరుకున్నారు.

* అండర్‌-16 బాలికల విభాగంలో పి.భవ్య (విజయవాడ), పి.యుతిక (విజయవాడ)లు ఫైనల్‌లో ప్రవేశించారు.

* స్త్రీ, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో తొలి రౌండ్‌లో తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించి పలువురు క్రీడాకారులు రెండో రౌండ్‌లో ప్రవేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని