అక్టోబరు 9, 10 తేదీల్లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

అక్టోబరు 9, 10 తేదీల్లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో


గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ఎస్‌బీఐ డీజీఎం రంగరాజన్‌, క్రెడాయ్‌ ప్రతినిధులు

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరి సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ఆధ్వర్యంలో అక్టోబరు 9, 10 తేదీల్లో నిర్వహించే ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోవాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీజీఎం కె.రంగరాజన్‌ అన్నారు. క్రెడాయ్‌ విజయవాడ ఛాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాపర్టీ షో గోడపత్రికను సోమవారం స్థానిక నోవాటెల్‌ హోటల్‌లో ఆవిష్కరించారు. దీనికి బ్యాంకు పూర్తి సహకారాన్ని అందజేస్తుందన్నారు. క్రెడాయ్‌ విజయవాడ ఛాప్టర్‌ అధ్యక్షులు కె.రాజేంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 ప్రాపర్టీ షోలను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వచ్చే నెలలో జరిగే 7వ ప్రాపర్టీ షోలో వివిధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బిల్డర్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. అవసరమైన వారికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ప్రాపర్టీ షో కన్వీనర్‌ రాంబాబు, క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, విజయవాడ ఛాప్టర్‌ కోశాధికారి శ్రీధర్‌ పలువురు బిల్డర్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని