ఒకేసారి రెండేళ్ల ప్రాక్టికల్స్‌
eenadu telugu news
Published : 21/09/2021 03:50 IST

ఒకేసారి రెండేళ్ల ప్రాక్టికల్స్‌


పరిశీలిస్తున్న డైట్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీనారాయణ, వినయ్‌

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: సాధారణంగా ఏ విద్యాసంవత్సరం పరీక్షలు అదే సంవత్సారంతంలో నిర్వహిస్తారు. కానీ డీఎడ్‌లో మాత్రం రెండు విద్యాసంవత్సరాలకు కలిపి ఒకేసారి రెండు పరీక్షలు నిర్వహిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 2019-21 విద్యాసంవత్సరం డీఎడ్‌(ఉపాధ్యాయ శిక్షణ) ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 25 వరకూ నిర్వహించనున్న ఈ పరీక్షల్లో విద్యార్థులు ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రాక్టికల్‌ పరీక్షలు రాస్తుండడం గమనార్హం. ఈ బ్యాచ్‌ విద్యార్థులకు తుది(రాత పరీక్షలు) పరీక్షలను కూడా ఈ ఏడాది జులై, ఆగస్టులలో నిర్వహించారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో పాఠశాలలు తెరవకపోవడంతో వారికి గతేడాది ప్రథమ సంవత్సర ప్రాక్టికల్స్‌ నిర్వహించలేదు. దీంతో ప్రస్తుతం ఒకేసారి ప్రథమ(2 సబ్జెక్ట్‌లు), ద్వితీయ(3 సబ్జెక్ట్‌లు) సంవత్సరపు ప్రాక్టికల్‌ పరీక్షలను ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. జిల్లాలోని 21 ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలలు(విద్యార్థులు లేక 9 కళాశాలు మూసివేశారు), ఒక ప్రభుత్వ అంగలూరు డైట్‌ కళాశాలకు చెందిన మొత్తం 279 మంది విద్యార్థులకు 11 కేంద్రాల్లో (గుడివాడ, గుడ్లవల్లేరు, విస్సన్నపేట, కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో) ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం గుడివాడలో ప్రాక్టికల్‌ పరీక్షను డైట్‌ ప్రిన్సిపల్‌ కె.లక్ష్మీనారాయణ, సీనియర్‌ అధ్యాపకుడు పి.వినయ్‌కుమార్‌ పరిశీలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని