మృత్యువులోను వీడని స్నేహబంధం
eenadu telugu news
Published : 21/09/2021 04:04 IST

మృత్యువులోను వీడని స్నేహబంధం


 వుల్లంగుల కోటేశ్వరరావు (పాతచిత్రం)  పగడాల అశోక్‌ (పాతచిత్రం)

నకరికల్లు, న్యూస్‌టుడే: వారంతా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ ముగ్గురూ ఒకేచోట పనిచేస్తూ ఎంతో స్నేహంగా ఉంటున్నారు. చివరికి మరణంలోనూ ఒకరినొకరు వీడకుండా అనంత లోకాలకు చేరడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆదివారం రాత్రి కండ్లకుంట వద్ద గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌లో ఈతకు దిగి ముగ్గురు గల్లంతవగా.. అందులో సామి సురేష్‌బాబు(30) అనే యువకుని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం గల్లంతైన వుల్లంగుల కోటేశ్వరరావు(31), పగడాల అశోక్‌(34) మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరులోని భారత్‌పేట, జొన్నలగడ్డ, నెహ్రూనగర్‌లకు చెందిన ముగ్గురు యువకులు పట్టణంలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం చల్లగుడ్లలోని స్నేహితుడి శుభకార్యానికి ముగ్గురూ హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉదయం వరకు మృతదేహాల ఆచూకీ లభించలేదు. రెవెన్యూ, పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పిలిపించే సమయానికి ఎట్టకేలకు ఇద్దరి యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం అనంతరం భౌతికకాయాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. వుల్లంగుల కోటేశ్వరరావుకు భార్య వెంకటలక్ష్మీతో పాటు, ఓ బాబు ఉన్నాడు. పగడాల అశోక్‌కు భార్య స్వాతి, ఇద్దరు పిల్లల సంతానం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేరాల ఉదయ్‌బాబు తెలిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని