భర్త చెంతకు చేర్చాలని వినతి
eenadu telugu news
Published : 21/09/2021 04:04 IST

భర్త చెంతకు చేర్చాలని వినతి


స్పందన కేంద్రంలో పసికందుకు సపర్యలు

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే: తండ్రి భుజాలపై ఆడుకోవాల్సిన పసికందును ఓ తల్లి పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చిన తీరు అక్కడి వారిని కలచివేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాతగుంటూరుకు చెందిన పోలమ్మకు మంగళగిరికి చెందిన యువకుడితో రెండేళ్ల కిందట వివాహమైంది. భర్త ఎలక్ట్రీషియన్‌ పనిచేస్తుంటారు. పెళ్లయిన ఆరు నెలలకే ఆమె తల్లిదండ్రులు మృతిచెందారు. ఆ బాధనుంచి కోలుకోకముందే తన భర్త, అత్తమామలు అధిక కట్నంకోసం ఇంటి నుంచి గెంటేశారని పోలమ్మ వాపోతున్నారు. ఆరు నెలల పసికందుతో తన సోదరుడి ఇంట్లో తలదాచుకుంటున్నానని తెలిపారు. పోలీసులు స్పందించి తర భర్త చెంతకు చేర్చాలని ఆమె వేడుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని