పారదర్శక బయో టెంప్లేట్‌ రూపకల్పన
eenadu telugu news
Published : 21/09/2021 04:04 IST

పారదర్శక బయో టెంప్లేట్‌ రూపకల్పన


పరిశోధనశాలలో డాక్టర్‌ అనిల్‌ సురేష్‌ బృందం

మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలోని నీరుకొండ వద్దనున్న ఏపీ ఎస్‌.ఆర్‌.ఎం. విశ్వవిద్యాలయం బయోలాజికల్‌ సైన్సెస్‌ విభాగం చేప పొలుసుల నుంచి పర్యావరణహిత పారదర్శక బయో టెంప్లేట్‌ రూపొందించింది. ఈమేరకు ఆ విభాగం ప్రతినిధి డాక్టర్‌ అనిల్‌ సురేష్‌ తన బృందంతో కలిసి సోమవారం తెలిపారు. డీఎన్‌ఏ, సీరం, ప్రోటీన్స్‌ రక్తం ఇతరత్రా రసాయనాల విశ్లేషణలో కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవడానికి అవసరమైన బయో పాలిమర్‌ అడాప్టర్‌ను తయారు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం క్లినికల్‌, ఫార్మసీ, ఫోరెన్సిక్‌ ప్రయోగశాలల్లో రసాయనాలు, రక్తం, మూత్రం, సీరం పరీక్షలకు టెక్నిషియన్లు, ఫార్మసిస్టులు యూవీ స్పెక్ట్రో ఫొటో మీటర్లు ఉపయోగిస్తారని చెప్పారు. క్వార్ట్స్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారైన క్యువేట్‌లో 5 మిల్లీ లీటర్లకు తక్కువ కాకుండా శాంపిల్స్‌ తీసుకుని స్పెక్ట్రో మీటర్లో ఉంచి వాటి రంగు, రూపు, తత్వం, పరిమాణం, సామర్థ్యం విశ్లేషిస్తుంటారన్నారు. ఇలాంటి పరీక్షల్లో కచ్చితత్వాన్ని తెచ్చేందుకు తన బృందంలోని పరిశోధక విద్యార్థులు దివ్య, తరుణ్‌ రిసెర్చ్‌ చేపట్టినట్లు వెల్లడించారు. చేప పొలుసులను శుభ్రం చేసి వాటి మీద అల్ట్రా లోవాల్యూమ్‌ శాంపిళ్ల విశ్లేషణ చేయడాన్ని ప్రారంభించారని తెలిపారు. పొలుసుల్లోని హైడ్రో ఫిలిసిటీ తత్వం వల్ల కేవలం 10 మైక్రో లీటర్ల (ఒక్క చుక్క) శాంపిల్‌ విశ్లేషణకు సరిపోతుందన్నారు. ఫలితం కూడా వేగంగా, కచ్చితత్వంతో ఉంటుందన్నారు. అంతేగాకుండా శాంపిల్‌కు వాడే క్యువేట్‌ కొనుగోలు ఖర్చు తగ్గడమే కాకుండా త్వరగా ఫలితాన్ని పొందే వీలుంటుందని ఆయన వివరించారు. దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించడంతో రీసెర్చ్‌ నివేదికను ప్రఖ్యాత గ్రీన్‌ కెమిస్ట్రీ తన జర్నల్‌లో ప్రచురించినట్లు ఆయన వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని