‘ఫోర్జరీ సంతకం వ్యవహారం తేల్చాలి’
eenadu telugu news
Updated : 22/09/2021 12:03 IST

‘ఫోర్జరీ సంతకం వ్యవహారం తేల్చాలి’


సీఎం జగన్‌తో మాట్లాడుతున్న జడ్పీటీసీగా సభ్యురాలిగా ఎన్నికైన హారిక, పక్కన ఆమె మామ రాంప్రసాద్‌, భర్త రాము

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే : భోగవల్లి సత్రం ట్రస్టు అంశంలో రూ. 18 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తన భూదందా కొనసాగిస్తున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. తాను మీడియాకు ఆధారాలు వెల్లడించిన అనంతరం కొందరు వైకాపా నాయకులు భోగవల్లి సత్రం ట్రస్ట్‌కు సంబంధించిన అంశంపై ఫేక్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారని తెలిపారు. సంబంధిత యాజమాని సంతకం ఫోర్జరీ అయిందని, ఆ ఫోర్జరీ చేసిన 420 ఎవరో పోలీసులు తేల్చాలని డిమాండ్‌ చేశారు. భోగవల్లి సత్రం ట్రస్టు అంశంలో యాజమాని మీడియా ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రి, ఆయన అనుచరులపై విచారణ చేపట్టాలని ప్రకటనలో ఆయన డిమాండ్‌ చేశారు. దేవాదాయ ఆస్తులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన హారిక

గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే: జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన ఉప్పాల హారిక మంగళవారం తన భర్త రాము, మామ డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్‌ ఉప్పాల రాంప్రసాద్‌తో కలిసి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తనకు అవకాశం కల్పించాలని అభ్యర్ధించారు. జనరల్‌ స్థానంలో అత్యధిక ఆధిక్యంతో గెలిచిన బీసీ వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పార్టీ అవకాశం కల్పించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని