కొలిక్కి వచ్చిన బంగారం కేసు
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

కొలిక్కి వచ్చిన బంగారం కేసు

నిందితురాలి అరెస్టుకు రంగం సిద్ధం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ రైల్వే, దుర్గగుడి ఉద్యోగుల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన నాగమణి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆమె పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితురాలిని పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో జల్సా చేసినట్లు తేలింది. బాధితులు ఆమెపై సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీటినన్నింటినీ ఆధారంగా చేసుకుని గత కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితురాలి ఆర్థిక లావాదేవీలపై పూర్తిగా ఆరా తీశారు. ఆమె వద్ద సుమారు రూ.4లక్షల నగదు, 200 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమెను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని