జూద స్థావరంపై దాడి...రూ.10.45 లక్షల నగదు స్వాధీనం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

జూద స్థావరంపై దాడి...రూ.10.45 లక్షల నగదు స్వాధీనం

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న జూద కేంద్రంపై సెబ్‌, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 18 మంది జూదరులను అరెస్టు చేసి రూ.10,45,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంగళవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాలులో సెబ్‌ జేడీ కె.శ్రీలక్ష్మి వెల్లడించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని అనంతవరం పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో కొంతకాలంగా జూదం జరుగుతుందన్న సమాచారం ఎస్పీ విజయరావుకు వచ్చింది. ఆయన ఆదేశాలతో జేడీ శ్రీలక్ష్మి, నెల్లూరు గ్రామీణ డీఎస్పీ వై.హరినాథరెడ్డి పర్యవేక్షణలో ఎస్టీఎఫ్‌ (సెబ్‌), బుచ్చి సీఐ సీహెచ్‌ కోటేశ్వరరావు, సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి జూద స్థావరంపై దాడులు చేశారు. పేకాడుతున్న నెల్లూరుకు చెందిన హరిబాబు, పి.జవహర్‌ఖాన్‌, షేక్‌ జమాల్‌, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, రాంబాబు, విజయవాడకు చెందిన షేక్‌ మౌలాలి, డి.వరప్రసాద్‌, వి.సంజీవ్‌, పి.అర్జున్‌, ప్రకాశం జిల్లాకు చెందిన పిచ్చయ్య, కె.శ్రీను, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500 నగదు, 16 సెల్‌ఫోన్లు, తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సస్పెక్ట్‌ షీట్లు తెరవనున్నట్లు జేడీ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని