‘దేశాన్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న భాజపా’
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

‘దేశాన్ని పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న భాజపా’


గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న నాయకులు

చల్లపల్లి, న్యూస్‌టుడే : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌, పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తోందని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలగపూడి ఆజాద్‌ విమర్శించారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 27వ రైతు సంఘాల ఆధ్వర్యంలో భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యాచరణ రూపొందించేందుకు చల్లపల్లి చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంలో రాజకీయ పక్ష, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆజాద్‌ మాట్లాడుతూ భాజపా ప్రభుత్వ విధానాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు పార్టీలకతీతంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లు ఉపసంహరించుకోవాలని కోరారు. ఈనెల 27న జరిగే దేశబంద్‌ను విజయవంతం చేయాలని అన్నివర్గాలవారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గోడపత్రికలను ఆవిష్కరించారు. సీపీఎం అనుబంధ రైతుసంఘం కార్యదర్శి మాగంటి హరిబాబు, రైతుసంఘం నాయకులు హనుమానుల సురేంద్రనాథ్‌బెనర్జీ, గొర్రెపాటి వెంకటరామకృష్ణ, అట్లూరి వెంకటేశ్వరరావు, గొరిపర్తి రామారావు, రావి బాబూరావు, గుత్తికొండ రామారావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని