గాంధీ కొండ..ఇక ఆహ్లాదకరం
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

గాంధీ కొండ..ఇక ఆహ్లాదకరం

-ఈనాడు, అమరావతి

విజయవాడలోని పర్యాటక ప్రదేశం గాంధీకొండను అధికారులు శుభ్రం చేశారు. ‘గాంధీకొండపై.. నిర్లక్ష్యమే నిండా’ శీర్షికన ‘ఈనాడు’లో చిత్రకథనం ప్రచురితమైంది. గాంధీ స్మారక స్తూపం చుట్టూ ఉన్న చెట్లు, పిచ్చిమొక్కలను నగరపాలక సిబ్బంది తొలగించారు. రైల్వే ట్రాక్‌ చుట్టూ పెరిగిన చెట్లను తొలగించడంతో కొండపై నుంచి నగరమంతా సుందరంగా కనిపిస్తోంది. కొండదారినంతా  శుభ్రపరచి.. గోడలకు రంగులేస్తున్నారు. పార్కింగ్‌  ప్రదేశాల అభివృద్ధి, పచ్చదనం పెంచే పనులను వేగంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ అధికారులకు సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని