ఆ బండి ఆగింది..ఇది ఇలా కిక్కిరిసింది..
eenadu telugu news
Published : 22/09/2021 03:51 IST

ఆ బండి ఆగింది..ఇది ఇలా కిక్కిరిసింది..

ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు తరచూ మొరాయిస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కొత్తవి, విద్యుత్తు బస్సులు ఇలా ఎన్నో రకాల ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అవి కాగితాలను దాటడం లేదు. విజయవాడ నగరంలో సిటీ బస్సులను సామర్థ్యానికి మించి తిప్పుతుండడంతో అవి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. కరోనా తగ్గిందనో, తప్పకో ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బుడమేరు వంతెన వద్ద ఓ బస్సు ఆగిపోయింది. అందులోని ప్రయాణికులను ఇలా కిక్కిరిసిన బస్సులో ఎక్కించారు. దీంతో కాలుపెట్టే చోటు కూడా లేని పరిస్థితి ఆ బస్సులో ఉంది.

- ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని