AP CM jagan: డిసెంబరు నుంచి సచివాలయాలను సందర్శిస్తా: సీఎం జగన్‌
eenadu telugu news
Published : 22/09/2021 18:35 IST

AP CM jagan: డిసెంబరు నుంచి సచివాలయాలను సందర్శిస్తా: సీఎం జగన్‌

అమరావతి: స్పందన, జగనన్న శాశ్వత గృహ హక్కు, జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌, ఉపాధి హామీ, అర్బన్‌ క్లినిక్‌లు, కొవిడ్‌, సీజనల్‌ వ్యాధులు, దిశ యాప్‌, సాగు పథకాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెర్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పెండింగ్‌ కేసులపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. 758 పెండింగ్‌ కేసుల పరిష్కారంపై అధికారులు, లాయర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబరు 21న జగనన్న శాశ్వత గృహనిర్మాణ పథకం అమలు, టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలని ఆదేశించారు.

‘‘గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యం. తనిఖీలపై నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవు. డిసెంబరు నుంచి నేను కూడా గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తా. ఈనెల 24, 25 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం. ప్రతినెల చివరి శుక్రవారం, శనివారం సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం. దసరా రోజున ఆసరా పథకం అమలు. వచ్చే నెల 7 నుంచి 16 మధ్య ఆసరాపై అవగాహన కార్యక్రమాలు. అక్టోబరు 1న క్లాప్‌, 19న జగనన్న తోడు కార్యక్రమం. అక్టోబరు 26న రైతులకు సున్నా వడ్డీ రుణాల కార్యక్రమం. అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు’’ చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, ప్రాధాన్య ప్రాజెక్టులకు భూ బదలాయింపుపై కూడా సమావేశంలో చర్చించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని