రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: జగన్‌
eenadu telugu news
Published : 22/09/2021 21:44 IST

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది: జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతినిధులకు సీఎం హామీ ఇచ్చారు. రైజింగ్‌ స్టార్స్‌ మొబైల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోష్‌ పాల్గర్‌, కంపెనీ ప్రతినిధి లారెన్స్ సీఎంను కలిసి.. రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌ కంపెనీ విస్తరణ, పెట్టుబడులపై సీఎంతో చర్చించారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైఎస్‌ఆర్‌ ఈఎంసీ, సీఈఓ నందకిషోర్‌ సమావేశంలో పాల్గొన్నారు. కొవిడ్‌ కష్టకాలంలోనూ నెల్లూరు జిల్లా తడ, శ్రీసిటీలో తమ ప్లాంటు నిర్వహణలో ప్రభుత్వం మంచి సహకారం అందించిందన్న జోష్ పాల్గర్.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని