త్వరలో 11వ పీఆర్‌సీ ప్రకటన
eenadu telugu news
Published : 23/09/2021 02:08 IST

త్వరలో 11వ పీఆర్‌సీ ప్రకటన

అలంకార్‌కూడలి(విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు త్వరలో 11వ పీఆర్‌సీ అమలు చేస్తుందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీఐ-డీఎల్‌టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఐటీఐ-డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘం 12వ రాష్ట్ర స్థాయి సమావేశాలు బుధవారం నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరాం. 11వ పీఆర్‌సీ నివేదిక ఇచ్చి దాదాపు ఏడాది పూర్తయిందని గుర్తు చేశాం. ఆర్థిక ఇబ్బందులతో పీఆర్‌సీ ప్రకటన కోసం ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నట్లు’ వివరించామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారని, త్వరలోనే పీఆర్‌సీ అమలుపై విధానమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సమావేశంలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, ఐటీఐ జాయింట్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం, ఆర్‌జేడీ ఆర్‌.వి.రమణ, డిప్యూటీ డైరెక్టర్‌ బాలవర్థన్‌రావు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి, ఐటీఐ-డీఎల్‌టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.హరిధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి రత్నంరాజు, కోశాధికారి పుట్టగుంట రమేష్‌బాబు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని