చిత్రవార్తలు
eenadu telugu news
Updated : 23/09/2021 02:56 IST

చిత్రవార్తలు

జారే బండ... దేవుడే అండ

ఈ కొండపై రాళ్లను చూడండి.. ముక్కలు ముక్కలుగా విడిపోయి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో! దానికిందే పలువురు ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ కొండకు వెనుక వైపు క్రషింగ్‌ నిమ్తితం పేలుళ్లు నిర్వహిస్తుంటారు. పేలుళ్ల కారణంగా వచ్చే కంపనాలతో అదిరి రాళ్లు జారిపడితే అక్కడ నివాసం ఉండే వారికి ప్రమాదమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి పంచాయతీ శివారు కిలేశపురంలో ఈ పరిస్థితి నెలకొంది.

- అమరావతి, ఈనాడు


వారేమో బుడుగులు.. దారేమో మడుగులు

వర్షం వస్తే చాలు నూజివీడు మండలం మీర్జాపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణ బురదమయంగా మారుతుంది.  బయటకు రావాలన్నా అందులో నుంచే రావాలి. గన్నవరం మండలం ముస్తాబాద మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల కిటికీలు విరిగిపోయి స్లాబులపై ఇలా మొక్కలు మొలిచాయి. ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

-ఈనాడు, విజయవాడ


నిర్లక్ష్యం మొక్కై మొలిచింది


అవస్థల మార్గం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ లోపలికి వృద్ధులు, దివ్యాంగులు రావాలంటే అవస్థలు తప్పడం లేదు. బస్సు  ప్రాంగణంలో రద్దీ కారణంగా కొన్నిసార్లు ఎదురుగా వచ్చే వారు తగిలి పడిపోతున్నారు. బస్టాండ్‌ ప్రాంగణంలోకి వెళ్లడానికి ర్యాంప్‌ ఏర్పాటు చేస్తే  బాగుంటుందని వారు కోరుతున్నారు.

-ఈనాడు గుంటూరు


పుట్టగొడుగులు... ఆరోగ్యానికి అడుగులు...

వర్షాకాలంలో కొద్దికాలం మాత్రమే దొరికే పుట్టగొడుగులకు ఈ మధ్య కాలంలో గిరాకీ పెరిగింది. విటమిన్‌ డి అత్యధికంగా కలిగి ఉండడంతో ప్రజలు వీటిని వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు.కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. నగర శివారు ఏటుకూరు బైపాస్‌ వద్ద నగరవాసులు పుట్టగొడుగులు కొనుగోలు చేస్తున్న దృశ్యం.

-ఈనాడు, గుంటూరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని