సర్వర్‌ సమస్య పరిష్కరించండి : డీలర్ల సంఘం
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

సర్వర్‌ సమస్య పరిష్కరించండి : డీలర్ల సంఘం


పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న డీలర్లు

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : రేషన్‌ డిపోల ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు తలెత్తుతున్న ఈ-పోస్‌ సర్వర్‌ సమస్యను అధికారులు పరిష్కరించాలని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఆ సంఘం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట డీలర్లు ధర్నా నిర్వహించారు. సర్కిల్‌-3 ఏఎస్‌ఓ కోమలి పద్మను కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ... గత నాలుగు రోజులుగా సర్వర్‌ సమస్యతో కార్డుదారులకు ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద బియ్యం పంపిణీ ఆలస్యమవుతోందన్నారు. గంటల తరబడి ప్రజలు వేచిఉంటున్నా... రేషన్‌ పొందలేక పోతున్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ తలెత్తని సర్వర్‌ సమస్య.. పౌర సరఫరాల శాఖలోనే ఎందుకు తలెత్తుతుందో అర్థం కావడం లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరించక పోవడం సరికాదన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే డిపోలను మూసివేస్తామని హెచ్చరించారు. నగర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌ మాట్లాడుతూ... కనీసం సర్వర్‌ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. కార్యక్రమంలో సంఘం నగర నాయకులు పూర్ణ, గురునాధం, మద్దెల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని