ఏపీలో అపరిష్కృతంగా గిరిజనుల సమస్యలు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

ఏపీలో అపరిష్కృతంగా గిరిజనుల సమస్యలు

కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు పరిశీలిస్తున్న గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి, ఎంపీ అశోక్‌ నేతే

భవానీపురం(విజయవాడ), న్యూస్‌టుడే : ఏపీలో గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని గిరిజన మోర్చా జాతీయ కార్యదర్శి, ఎంపీ అశోక్‌ నేతే పేర్కొన్నారు. ఏపీ గిరిజన మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్‌ నేతే మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులు అసంతృప్తితో ఉన్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గిరిజనుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం ఎస్టీల సమస్యల పరిష్కారానికి జోనల్‌ వారీగా బాధ్యులను నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయటం లేదన్నారు. రాష్ట్రంలో ఎస్టీ జనాభా ప్రకారం ఎంపీ, శాసనసభ్యుల స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా కొమరంభీం చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చిత్ర ప్రదర్శనను తిలకించారు. సమావేశంలో గిరిజన మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు అజ్మీర్‌బాబీ, నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని