జగనన్న కాలనీలకు అప్రోచ్‌ రోడ్లు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

జగనన్న కాలనీలకు అప్రోచ్‌ రోడ్లు


వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నివాస్‌, కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసెీలు శివశంకర్‌, శ్రీవాస్‌ అజయ్‌కుమార్‌ తదితరులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: జగనన్న ఇళ్ల కాలనీలకు అప్రోచ్‌ రోడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించేందుకు అనుమతించాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి బుధవారం స్పందన కార్యక్రమంపై దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌, జెసీలు ఎల్‌.శివశంకర్‌, కె.మోహన్‌కుమార్‌, శ్రీవాస్‌ అజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న లేఔట్లకు అవసరమైన అప్రోచ్‌ రోడ్లను ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిర్మాణం చేపడితే ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతమవుతాయని వివరించారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రామచంద్రన్‌, డ్వామా పీడీ సూర్యనారాయణ, తాడిగడప మున్సిపల్‌ కమిషనర్‌ ప్రకాశరావు, వ్యవసాయ శాఖ జేడీ టి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని