ఎయిమ్స్‌లో గైనకాలజీ ప్రత్యేక క్లినిక్‌ సేవలు
eenadu telugu news
Published : 23/09/2021 03:15 IST

ఎయిమ్స్‌లో గైనకాలజీ ప్రత్యేక క్లినిక్‌ సేవలు

మంగళగిరి, న్యూస్‌టుడే: నగరంలోని ఎయిమ్స్‌లో ప్రసూతి, గైనకాలజీ విభాగం ప్రత్యేక క్లినిక్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ముఖేష్‌ త్రిపాఠి మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలతో పాటు స్త్రీల సంబంధిత వైద్య చికిత్సలు అందుబాటులో తెచ్చినట్లు చెప్పారు. ఈ ప్రత్యేక క్లినిక్‌ ప్రతి బుధ, గురువారాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సేవలందిస్తుందన్నారు. బుధవారం కుటుంబ నియంత్రణ, వంద్యత్వ, కౌమార, గురువారం రుతుక్రమంపై కౌన్సెలింగ్‌, గైనకాలజికల్‌ క్యాన్సర్లతో పాటు గర్భాశయం స్క్రీనింగ్‌ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆయన వెంట మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌కక్కర్‌ ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని