మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో ద్విచక్ర వాహనం
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

మార్కెట్‌లోకి కొత్త ఫీచర్లతో ద్విచక్ర వాహనం


వినియోగదారుడికి సీబీ200ఎక్స్‌ కీ అందజేస్తున్న అట్సుషి ఒగటా

గుంటూరు సిటీ, న్యూస్‌టుడే: అధునాతన ఆవిష్కరణలతో హోండా సీబీ200ఎక్స్‌ ద్విచక్ర వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు కొత్తపేటలోని సంతోష్‌ హోండా షోరూంలో హోండా మోటార్‌ సైకిల్‌, స్కూటర్‌ ఇండియా సంస్థ అధ్యక్షుడు అట్సుషి ఒగటా ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ వాహనాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులు, సౌకర్యాలకు అనుగుణంగా హోండా సంస్థ ద్విచక్ర వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సీబీ200ఎక్స్‌ వాహనానికి 184.4సీసీ, ఐదు గేర్ల పీజీఎంఎఫ్‌ఐ ఇంజన్‌, 2 డిస్క్‌ బ్రేక్‌లు తదితర నూతన ఫీచర్లు ఉన్నట్లు తెలిపారు. సంతోష్‌ హోండా సంస్థ అధినేత చుక్కపల్లి జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ రానున్న విజయదశమి సందర్భంగా ఈ నెల 22 నుంచి షోరూంలో ప్రతి హోండా వాహనం అమ్మకాలపై రూ.13,499 చరవాణిని బహుమతిగా అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సీబీ200ఎక్స్‌ బైక్‌ను మొదటి కొనుగోలుదారుడికి అందజేశారు. కార్యక్రమంలో హోండా ప్రతినిధులు రాజాగోపి, జీఎం యోగేష్‌ మాథుర్‌, డీజీఎం వివేక్‌ తలుజా, శ్రీవత్స, జోనల్‌ హెడ్‌ అనంత, సేల్స్‌ ఇన్‌ఛార్జి అవినాష్‌, సంతోస్‌ హోండా జీఎం ఏవీ సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని