ఏబీవీపీ ఆందోళనపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

ఏబీవీపీ ఆందోళనపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు


సతీష్‌చంద్రకు వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి ఐకాస నాయకులు, పక్కన ఆచార్య హేమచంద్రారెడ్డి

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పాలక మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏబీవీపీ చేసిన ఆందోళనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి ఐకాస నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. వీసీ ఆచార్య రాజశేఖర్‌పై ఏబీవీపీ చేసిన వ్యాఖ్యలను విద్యార్థి ఐకాస నాయకులు ఖండించారు. కార్యక్రమంలో కన్వీనర్‌ రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని