ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి


ఆర్జేడీ సుబ్బారావుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న యూటీఎఫ్‌ జిల్లా నాయకులు

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు గుంటూరు పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్‌.సుబ్బారావును కోరారు. బుధవారం ఆయనను ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌కుమార్‌, కళాధర్‌లు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మురికిపూడి హైస్కూల్‌ హెచ్‌ఎం సమస్య పరిష్కరించాలని, వట్టిచెరుకూరు పాఠశాలలో ఉపాధ్యాయుల మీద దాడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్‌ఏసీ ఆర్డర్ల జారీలో జాప్యం నివారించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి యు.రాజశేఖర్‌, షకీలాబేగం, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని