శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన రైల్వే జీఎం
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన రైల్వే జీఎం


భవనాల నమూనా ప్రతులను పరిశీలిస్తున్న జీఎం గజానన్‌ మాల్య, చిత్రంలో డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌. ఏడీఆర్‌ఎం తదితరులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: నగరంలోని కృష్ణా కెనాల్‌ రైల్వే జంక్షన్‌ వద్ద నూతనంగా నిర్మిస్తున్న మల్టీ డిసెప్లినరీ డివిజనల్‌ రైల్వే ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ భవనాలను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య బుధవారం ఉదయం పరిశీలించారు. అనంతరం పూర్తయిన శిక్షణ పరిపాలన భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు డివిజనల్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారి వివరాలతో పాటు ఏయే కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారో అధికారులు వివరించారు. వసతిగృహం, డైనింగ్‌ బిల్డింగ్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, మురుగునీటి శుద్ధి కేంద్రం తదితరాల గురించి తెలిపారు. వసతిగృహం మోడల్‌ స్టేట్స్‌, ల్యాబ్‌, మోడల్‌ ట్రాక్‌, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితరాలు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పడంతో ఆయన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వసతిగృహంలో గదుల సంఖ్య, గదికి ఎన్ని పడకలు ఏర్పాటు చేయనున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం జోనల్‌ సెంట్రలైజ్డ్‌ స్మాల్‌ ట్రాక్‌ మిషన్స్‌ డిపోను తనిఖీ చేశారు. తదుపరి అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆయన వెంట విజయవాడ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ శివేంద్రమోహన్‌, ఏడీఆర్‌ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని