ప్రథమ చికిత్సపై ముగిసిన శిక్షణ
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

ప్రథమ చికిత్సపై ముగిసిన శిక్షణ


విద్యార్థులకు ధ్రువపత్రాలు అందిస్తున్న ఆచార్య వరప్రసాదమూర్తి, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, సమరం

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ప్రథమ చికిత్సపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వ్యాయామ కళాశాల విద్యార్థులకు కృష్ణాజిల్లా రెడ్‌క్రాస్‌ సంస్థ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. ముగింపు సమావేశానికి రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రథమ చికిత్సలో శిక్షణ తీసుకున్న 100 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆచార్య వరప్రసాదమూర్తి మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ చేసే మంచి కార్యక్రమాలకు ఏఎన్‌యూ సహకారం అందిస్తుందన్నారు. డాక్టర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై విద్యార్థులకు కనీస అవగాహన ఉండాలని ఆకాంక్షించారు. కొవిడ్‌పై అవగాహన కల్పించేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించామన్నారు. గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించేందుకు ఏఎన్‌యూ ఎంతో సహకరించిందన్నారు. డాక్టర్‌ సమరం మాట్లాడుతూ విద్యార్థులంతా కరోనా టీకాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పాల్‌కుమార్‌, ప్రథమచికిత్స శిక్షణ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్‌ అన్నమ్మ, డాక్టర్‌ రామ్మోహనరావు, డాక్టర్‌ సూర్యనారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని