అందుబాటులో లక్ష ఆర్‌డీటీ కిట్లు
eenadu telugu news
Published : 23/09/2021 03:46 IST

అందుబాటులో లక్ష ఆర్‌డీటీ కిట్లు

వీటి సాయంతో రెండు నిమిషాల్లోనే మలేరియా నిర్ధారణ

పొన్నూరు మలేరియా శాఖ కార్యాలయ ఆవరణలో ఆర్‌డీటీ కిట్‌ ద్వారా పరీక్షిస్తున్న వైద్యులు

గతంలో మలేరియా పరీక్షలు నిర్వహించాలంటే వైద్య సిబ్బంది రెండు రోజుల సమయం తీసుకున్న అనంతరం ఆ వ్యాధిని నిర్ధారించే వారు. నేడు ఆర్‌డీటీ కిట్‌ ద్వారా రెండు నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. రోజు రోజుకూ డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మలేరియా కేసులు తక్కువగా నమోదైనప్పటికీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ కిట్లను అందుబాటులోకి తెచ్చినట్టు మలేరియాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

పొన్నూరు, న్యూస్‌టుడే

జిల్లాలో 17 మలేరియా సబ్‌డివిజన్‌ కార్యాలయాలు, వీటి పరిధిలో 80 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నట్టు వైద్యాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మురుగుకాలువ వ్యవస్థ లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రత తదితర కారణాల వల్ల దోమల సమస్య పెరిగిపోయింది. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు రకాల క్రిముల వల్లే మలేరియా సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. గతంలో ఈ వ్యాధిని నిర్ధారించడానికి ల్యాబ్‌ టెక్నీషియన్‌ రక్త నమూనాలు సేకరించి, వాటిని పరీక్షించడానికి రెండు రోజుల సమయం కావాల్సి వచ్చేది. ఈ లోగా జ్వరంతో బాధపడుతున్న రోగి సమస్యలు మరింత పెరిగేవి. అయితే ప్రస్తుతం సర్కారు ‘ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్ట్‌’ (ఆర్‌డీటీ) కిట్లను అందుబాటులోకి తెచ్చింది. రోజు మార్చి రోజు జ్వరం రావడం, వాంతులు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు సచివాలయాల్లో కానీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోని వైద్యులను కాని సంప్రదిస్తే వెంటనే ఆర్‌డీటీ కిట్ల ద్వారా మలేరియా పరీక్ష నిర్వహించి కేవలం రెండు నిమిషాల్లోనే వ్యాధి నిర్ధారణ చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో లక్ష కిట్ల వరకూ అందుబాటులో ఉన్నట్టు మలేరియాశాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ కిట్లను సబ్‌ డివిజన్ల వారీగా పంపణీ చేసినట్టు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

ఈ విషయమై జిల్లా మలేరియా శాఖ అధికారిణి అల్లాడి జ్ఞానేశ్వరిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. మలేరియా వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో లక్షకు పైగా ఆర్‌డీటీ కిట్లను అందుబాటులో ఉంచినట్టు, వాటిని ప్రతి సబ్‌ డివిజన్‌కు అందజేసినట్టు చెప్పారు. సచివాలయాల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వాటిని అందించాలని సబ్‌ డివిజన్‌ అధికారులను కోరినట్టు ఆమె చెప్పారు.


ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ టెస్ట్‌ కిట్లు ఇవే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని