Ap politics: మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెదేపాకు రాజీనామా
eenadu telugu news
Published : 23/09/2021 16:49 IST

Ap politics: మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెదేపాకు రాజీనామా

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి తన అవసరం లేనందునే రాజీనామా చేస్తున్నట్టు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. పార్టీ ఓడిపోయి రెండేళ్లు అవుతున్నా.. తన సేవలను వినియోగించుకోవడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని తెలిపారు.  సీఎం జగన్‌ పేదలకు న్యాయం చేస్తున్నారని, ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తన శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని మురుగుడు హనుమంతరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని