చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

చిత్ర వార్తలు

భూమిని తడపాలి... పంటను నిలపాలి

పంట పెట్టడానికి నీటి వసతిలేక గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన వాసుబాబు పడుతున్న పాట్లివి. ఏలూరుకాల్వ పక్కనే పోతున్నా పొలంలోకి నీరు రావడం లేదు. దీంతో కాల్వలోని వాన నీటిని ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా తోడుకుని డ్రమ్ముల్లోకి పట్టుకుని.. బిందెలతో తీసుకొచ్చి మిరప పొలాన్ని తడుపుతున్నారు. ఇలా పంట పూర్తయ్యేదాకా కష్టపడాల్సిందేనని అంటున్నారు. ఒక పంట పెట్టడానికి రూ.2లక్షల దాకా కూలీ, నీటి ఖర్చులు అవుతున్నాయని వాపోయారు. తూములు, కాల్వలు పూడుకుపోవడం.. వీటిపై నిర్మాణాలు కూడా రావడంతో ఎత్తిపోతల పథకం నీరు పొలాలకు రావడం లేదని చెబుతున్నారు.


పైపెచ్చు ప్రమాదం..!

పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి ఇది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి ప్రమాదకరంగా ఉంది. తరగతి గదులుకూడా పాడుబడి ఉన్నాయి. పెచ్చులు పిల్లలపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రధానోపాధ్యాయుడిని వివరణ అడుగ్గా నాడు-నేడు మొదటి దశలో ఈ బడిని చేర్చలేదన్నారు. రెండో దశ జాబితాలో చేర్చారన్నారు. నిధులు వచ్చిన తర్వాత భవనాన్ని బాగు చేయిస్తామన్నారు. అంతలోగా ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యతో అధికారులే ఆలోచించాలి.


ఉద్యానం ముస్తాబు

విజయవాడ రాజీవ్‌ గాంధీ పార్కు సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పిల్లలు ఆడుకునే యంత్రాలను కొత్తగా బిగిస్తున్నారు. వింటేజ్‌ ట్రైన్‌ కొత్తది ఏర్పాటు చేయడానికి పార్కు మధ్యలో పట్టాలు వేస్తున్నారు. దసరా ఉత్సవాల నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

-ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని