దూర విద్య ప్రవేశాల గడువు పెంపు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

దూర విద్య ప్రవేశాల గడువు పెంపు

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకు అపరాధ రుసుంతో ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించామని సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. ప్రవేశాలు ఈ నెల 19వ తేదీతో ముగియగా.. విద్యార్థుల కోరిక మేరకు అపరాధ రుసుం రూ.200లతో గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తిగలవారు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో, లేదా అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 0866-2434868, 73829 29642 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని