ఉపకార వేతన పరీక్షకు దరఖాస్తులు
eenadu telugu news
Published : 24/09/2021 03:35 IST

ఉపకార వేతన పరీక్షకు దరఖాస్తులు


గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న సంస్థ ప్రతినిధులు

బెంజిసర్కిల్‌(పటమట), న్యూస్‌టుడే: ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వార్షిక స్కాలర్‌షిప్‌ పరీక్షను డిసెంబర్‌ 4 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నామని దక్షిణ భారత రీజనల్‌ డైరెక్టర్‌ చందన్‌ చాంద్‌ అన్నారు. గురువారం బెంజిసర్కిల్‌ సమీపంలోని సంస్థ కార్యాలయంలో పరీక్షకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం చందన్‌ చాంద్‌ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. ట్యూషన్‌ ఫీజుపై స్కాలర్‌షిప్‌తో పాటు అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి నగదు బహుమతులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రీజనల్‌ బిజినెస్‌ హెడ్‌ గిరి శ్రీపతి, డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, కొమ్మినేని వెంకటేష్‌, ఏడీ విజయ్‌ కుమార్‌, విజయవాడ బ్రాంచి హెడ్‌ సూర్య భాస్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని