కేంద్ర సాహిత్య అకాడమీ సంకలనంలో జాని కథకు స్థానం
eenadu telugu news
Published : 24/09/2021 03:46 IST

కేంద్ర సాహిత్య అకాడమీ సంకలనంలో జాని కథకు స్థానం


షేక్‌ అబ్ధుల్‌ హకీం జాని

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏడాది ప్రచురించిన బాలల కథా సంకలనంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాల సాహితీవేత్త షేక్‌ అబ్దుల్‌ హకీంజాని కథకు చోటు దక్కింది. ఆయన రచించిన ‘అన్నం పెట్టే చెట్టు’ కథను ఈ పుస్తకంలో పొందుపరిచారు. మొత్తం 56 మంది ప్రముఖ బాల సాహితీవేత్తల రచనలతో ‘బాలల మంచి కథలు’ పేరిట రూపొందించిన ఈ సంకలనానికి తెనాలికి చెందిన డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య సంపాదక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే పుస్తకం సిద్ధమైన తర్వాత ఆయన మృతిచెందారు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించి విడుదల చేసింది. హకీంజాని బాలల కోసం ఇప్పటి వరకు 32 పుస్తకాలు, 260 కథలు రచించారు. గతంలో ఆయన రచించిన ‘బాధ్యతాయుత పౌరులు’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ 11వ తరగతి పాఠ్యపుస్తకంలోనూ, ‘కొత్త వెలుగు’ కథ 12వ తరగతి పాఠ్యపుస్తకంలోనూ స్థానం పొందాయి. ఈ వివరాలను హకీం జాని గురువారం తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని