మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షునిగా కైతేపల్లి
eenadu telugu news
Published : 24/09/2021 03:46 IST

మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షునిగా కైతేపల్లి


కైతేపల్లి దాస్‌

చల్లపల్లి, న్యూస్‌టుడే : గుంటూరు నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎంఈఎఫ్‌ సమావేశంలో నవ్యాంధ్ర మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన ప్రధానోపాధ్యాయుడు కైతేపల్లి దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు తెలిపారు. నవ్యాంధ్ర ఎంఆర్‌పీఎస్‌ అనుబంధ సంఘమైన ఎన్‌ఎంఈఎఫ్‌ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా గుంటూరుకు చెందిన డాక్టర్‌ పి.భరత్‌కుమార్‌, ప్రకాశం జిల్లాకు చెందిన జి.ప్రసాద్‌ కోశాధికారిగా ఎన్నికయ్యారు. వారితోపాటు 42 మంది కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని