AP News: అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
eenadu telugu news
Published : 24/09/2021 10:08 IST

AP News: అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

గుంటూరు: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల కోడెల వర్ధంతి సభలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ న్యాయవాది వేముల ప్రసాద్‌ అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు ఇదే విషయంపై నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లోనూ ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని