ఆర్జీయూకేటీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

ఆర్జీయూకేటీ సెట్‌కు ఏర్పాట్లు పూర్తి

నూజివీడు, న్యూస్‌టుడే: ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 26న నిర్వహించనున్న ఆర్జీయూకేటీసెట్‌కు మొత్తం 75,283 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కులపతి ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. శనివారం నూజివీడులో విలేకరులతో మాట్లాడారు. పరీక్ష పూర్తి కాగానే పరీక్షా పత్రాలను హెడ్‌క్వార్టర్‌కు చేర్చడానికి రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి అనువుగా రెండు, మూడు నెలల్లో అధునాతన కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో పది వేల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తామని తెలిపారు. స్వయం ఉపాధి సాధించడానికి ఇన్‌క్యుబేషన్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇడుపులపాయకు చెందిన 2008 బ్యాచ్‌ ఈసీఈ విద్యార్థిని గొప్పిల విద్యాధరి 2021లో సివిల్స్‌లో 211వ ర్యాంకు సాధించినట్లు చెప్పారు. నూజివీడు క్యాంపస్‌లో 2008లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన పావని పీహెచ్‌డీ చేసిన ఆర్జీయూకేటీ ప్రప్రథమ విద్యార్థినిగా నమోదైందని చెప్పారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ కె.సామ్రాజ్యలక్ష్మి, ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ జీవీఆర్‌ శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ సెట్‌ కన్వీనర్‌ హరినారాయణ, సీఈటీఎల్‌ఎస్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, ఏవో భానుకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని