బందరు ఆస్పత్రిలో శిశువు మాయం
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

బందరు ఆస్పత్రిలో శిశువు మాయం


శిశువును అపహరించినట్లుగా భావిస్తున్న మహిళ (సీసీ ఫుటేజీ)

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా ఆస్పత్రి నుంచి ఐదు రోజుల శిశువు మాయమైన సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. పామర్రు మండలం పెదమద్దాలికి చెందిన హిందూజ, ఏసుబాబులు ప్రేమ వివాహం చేసుకున్నారు. గర్భిణి అయిన హిందూజ జిల్లా ఆస్పత్రిలో ఐదు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చారు. శుక్రవారం ఓ మహిళ ఏసుబాబు బంధువుగా పరిచయం చేసుకుని వైద్యశాలలోనే హిందూజతో పాటు ఉన్నారు. శనివారం డిశ్ఛార్జి చేయనున్న క్రమంలో హిందూజ వార్డు నుంచి బయటకు వచ్చి తిరిగి బెడ్‌ వద్దకు వెళ్లి చూడగా శిశువుతో పాటు ఆ మహిళ కన్పించలేదు. కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుని ఉండవచ్చని భావిస్తుండగా విషయం తెలుసుకున్న మచిలీపట్నం స్టేషన్‌ పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అవసరం మేర సెక్యూరిటీ ఉన్న జిల్లా ఆస్పత్రిలో ఈ విధమైన సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని