‘48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేయాలి’
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

‘48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేయాలి’

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: జనసేన పార్టీ పెడన సమన్వయకర్త యడ్లవల్లి రామ్‌ సుధీర్‌ కారుపై దాడి పిరికిపందల చర్య అని, 48 గంటల్లో నిందితులను అరెస్ట్‌ చేయకపోతే శాంతియుత మార్గంలో పోలీసులను నిలదీస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ అన్నారు. శనివారం ఎంజీరోడ్డులోని ఓ హోటల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యలపై నిలదీస్తున్నందుకే రామ్‌ సుధీర్‌ వాహనంపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రోద్బలంతో ఆ పార్టీ నాయకులు దాడి చేశారని ఆరోపించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరును ప్రజలందరూ చూశారని, ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండేందుకు అర్హత లేదన్నారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలను జనసైనికులు ధైర్యంగా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరా తీస్తున్నారని తెలిపారు. రామ్‌ సుధీర్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, తాగునీరు, ఇతర సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తన వాహనంపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని, ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు చేస్తానని తెలిపారు. సమావేశంలో జనసేన పార్టీ అమరావతి ప్రతినిధి మండలి రాజేష్‌, ఎన్‌.చలపతి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని