సామాజిక సేవలు అభినందనీయం
eenadu telugu news
Published : 26/09/2021 03:52 IST

సామాజిక సేవలు అభినందనీయం


వినికిడి యంత్రాలను పంపిణీ చేస్తున్న మేయర్‌ భాగ్యలక్ష్మి, ఐడీసీఎల్‌ ఛైర్‌పర్సన్‌ పుణ్యశీల తదితరులు

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీన్‌దయాళ్‌ శ్రవణ ఫౌండేషన్‌ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో అండగా నిలవడం అభినందనీయమని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 130మందికి వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ ఛైర్మన్‌ రేగుల రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష మందికి వినికిడి యంత్రాలు పంపిణీ చేయాలనే లక్ష్యం.. వచ్చే ఏడాది సెప్టెంబరు 25వ తేదీకి పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల కేంద్ర కార్మిక బోర్డు ఛైర్మన్‌ జయప్రకాష్‌ నారాయణ్‌, భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, అడ్డూరి శ్రీరామ్‌, డాక్టర్‌ ఎస్‌.హసీనా, రామవరప్పాడు సర్పంచి శ్రీదేవి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని