నేటి టీకా లక్ష్యం లక్ష డోసులు
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

నేటి టీకా లక్ష్యం లక్ష డోసులు

గుంటూరు వైద్యం: జిల్లాలో 18 సంవత్సరాలు దాటి 44 ఏళ్లలోపు ఉన్న వారికి కొవిడ్‌ టీకా వేసేందుకు శనివారం లక్ష డోసుల టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఆదివారం వ్యాక్సినేషన్‌ జరగనుంది. ఈమేరకు శనివారం డీఎంహెచ్‌వో యాస్మిన్‌ టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యాధికారులతో మాట్లాడుతూ లక్ష డోసుల టీకా లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు.


జ్వరాలున్న ప్రాంతాల్లో ఇంటింటి సర్వే

గుంటూరు వైద్యం: డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా మలేరియా విభాగానికి చెందిన అధికారులతో మాట్లాడుతూ సరైన చికిత్స తీసుకుంటే వీటిని చాలావరకు నివారించుకోవచ్చని తెలియజేయాలన్నారు. జ్వరాలు ఉన్న ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని