శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవసరం
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవసరం


ప్రసంగిస్తున్న బీఐటీ వీసీ ఇంద్రనీల్‌ మన్నా. చిత్రంలో ఎస్‌ఆర్‌ఎం వీసీ వీఎస్‌ రావు, ప్రొ.వీసీ నారాయణరావు

మంగళగిరి, న్యూస్‌టుడే: దేశంలో సంపద సృష్టికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కీలకమని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఇంద్రనీల్‌ మన్నా పేర్కొన్నారు. నగరంలోని నీరుకొండ వద్దనున్న ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వెబినార్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. పరిశోధనలకు పుట్టుక, ముగింపు ఉండదని, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. నూతన సృజనకు ప్రతిఒక్కరు నాంది పలకాలన్నారు. నేటితరం యువ పరిశోధకులు ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త ప్రపుల్లచంద్ర రేని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయ ప్రొ వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య డి.నారాయణరావు మాట్లాడుతూ రెండేళ్లలోనే ఎస్‌ఆర్‌ఎం 600 పరిశోధన పత్రాలు సమర్పించిందన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ రావు, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ రఘునాథన్‌, ప్రొఫెసర్లు జీఎస్‌ వినోద్‌కుమార్‌, రంజిత్‌థాపా, షీలాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని