ఏఎన్‌యూకు ‘గ్రీన్‌ వర్సిటీ’ అవార్డు
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

ఏఎన్‌యూకు ‘గ్రీన్‌ వర్సిటీ’ అవార్డు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ‘గ్రీన్‌ యూనివర్సిటీ’ అవార్డు వరించింది. శుక్రవారర రాత్రి అమెరికాలోని న్యూయార్క్‌లో నిర్వహించిన 5వ ‘గ్రీన్‌ స్కూల్‌ కాన్ఫరెన్స్‌’ సందర్భంగా వర్చ్యువల్‌ సమావేశంలో ఈ అవార్డును అందజేసినట్టు ఏఎన్‌యూ ర్యాంకింగుల సమన్వయకర్త డాక్టర్‌ నాగకషోర్‌ చెప్పారు. విశ్వవిద్యాలయంలోని పచ్చదనాన్ని వీడియో రూపంలో ఈ అవార్డు కోసం పంపించామన్నారు. దేశంలోని నాలుగు ప్రభుత్వ, ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం ఈ అవార్డులను అందుకున్నట్టు చెప్పారు. ఏఎన్‌యూలో బొటానికల్‌ గార్డెన్‌, పచ్చదనం పెంచేందుకు వృక్షాల రక్షణ తదితర కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఈ అవార్డు వచ్చినట్టు వీసీ ఆచార్య రాజశేఖర్‌ చెప్పారు. పచ్చదనం పెంపునకు కృషిచేస్తున్న రాజు, ఇంజినీర్‌ కుమార్‌ రాజా, అవార్డు రావడానికి కారణమైన నాగకిషోర్‌ను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని