జిల్లాలో సీనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకం, బదిలీలు
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

జిల్లాలో సీనియర్‌ సివిల్‌ జడ్జిల నియామకం, బదిలీలు

గుంటూరు లీగల్‌ న్యూస్‌టుడే: జిల్లాలోని పలు సీనియర్‌ సివిల్‌ కోర్టుల్లో న్యాయమూర్తులను నియమిస్తూ, మరికొందరు జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరులో ఆరో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న కె.అరుణను ఉద్యోగోన్నతిపై శ్రీకాళహస్తి సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నియమించారు. ప్రధాన జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎ.సునీతారాణిని గుంటూరులోని నాలుగో సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నియమించారు. తిరుపతిలో పనిచేస్తున్న ఎ.శోభారాణిని నరసరావుపేట అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నియమిస్తూ, అక్కడ పనిచేస్తున్న సుంకర శ్రీదేవిని అక్కడే ఖాళీగా ఉన్న ప్రధాన సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి పోస్టులో నియమించారు. ఖాళీగా ఉన్న గురజాల సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి పోస్టులో నెల్లూరులో పనిచేస్తున్న బి.లీలావెంకట శేషాద్రిని నియమించారు. ఒంగోలులో పనిచేస్తున్న కె.వాణిని తెనాలి అదనపు సీనియర్‌ సివిల్‌ కోర్టులో నియమిస్తూ, అక్కడ పనిచేస్తున్న టి.రామచంద్రుడును అక్కడే ప్రధాన సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జిగా నియమించారు. చిలకలూరిపేటలో పనిచేస్తున్న టి.వాసుదేవన్‌ను బొబ్బిలికి బదిలీ చేశారు. అనంతపురంలో పనిచేస్తున్న డి.నాగవెంకటలక్ష్మిని ఖాళీగా ఉన్న సత్తెనపల్లి సీనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి పోస్టులో నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని