సందేశాత్మకంగా నాటికల పోటీలు
eenadu telugu news
Published : 26/09/2021 04:16 IST

సందేశాత్మకంగా నాటికల పోటీలు


జీవన వేదం నాటికలోని ఓ సన్నివేశం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, యువ కళావాహిని సంయుక్త నిర్వహణలో డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్‌ 27వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు సందేశాత్మకంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం తొలిగా ఆకెళ్ళ రచనకు, బీఎం రెడ్డి దర్శకత్వం వహించిన విశ్వశాంతి కల్చరల్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ వారి జీవన వేదం నాటికను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో మిర్చియార్డు పూర్వ అధ్యక్షుడు మన్నవ సుబ్బారావు, రామరాజు ఫౌండేషన్‌ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, దోగిపల్లి శంకరరావు, ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు ప్రసంగించారు. సభానంతరం ఎస్‌ డేవిడ్‌ రాజ్‌ రచించి, దర్శకత్వం వహించిన భద్రం ఫౌండేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ, విశాఖపట్నం వారి ‘ఇది కథ కాదు’ నాటికను ప్రదర్శించారు. మూడో నాటికగా ముద్దుకూరి రవీంద్రబాబు రచనకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘మంచం మీద పెళ్లి’ నాటికను ప్రదర్శించారు. కార్యక్రమాలను లంక లక్ష్మీనారాయణ, జి.మల్లికార్జునరావు నిర్వహించారు. బొప్పన నరసింహారావు, డి.తిరుమలేశ్వరరావు, జీవీజీ శంకర్‌ కార్యక్రమాలను పర్యవేక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని