పులిచింతల గేట్ల మరమ్మతుల పరిశీలన
eenadu telugu news
Published : 26/09/2021 04:21 IST

పులిచింతల గేట్ల మరమ్మతుల పరిశీలన


పనులు పరిశీలిస్తున్న నాణ్యతా విభాగం ఈఈ ఉమామహేశ్వరరావు తదితరులు

అచ్చంపేట, న్యూస్‌టుడే: పులిచింతల ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను శనివారం జలవనరుల శాఖ నాణ్యతా విభాగం ఈఈ ఎ.ఉమామహేశ్వరరావు బృందం పరిశీలించింది. వాక్‌ వే బ్రిడ్జికి లేడర్లు, గేట్లకు ఆయిలింగ్‌, కాంక్రీట్‌ పనులను తనిఖీ చేశారు. గేట్లకు ఎక్కడెక్కడ మరమ్మతులు అవసరమో గుర్తించి సూచనలు చేశారు. గేట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రాజెక్టు ఈఈ శ్యాంప్రసాద్‌, డీఈఈ అరుణకుమారి, ఏఈఈలు విక్రమ్‌, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెండు క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం రెండు క్రస్టుగేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు వదులుతున్నారు. కుడి కాలువకు 8221, ఎడమ కాలువకు 7029, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 32,803 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 65951 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, రోజాల నుంచి శ్రీశైలం జలాశయానికి 77,275 క్యూసెక్కుల నీరొచ్చి చేరుతుంది. సాగర్‌ నీటిమట్టం 589.50 అడుగుల వద్ద కొనసాగుతుంది. ఇది 310 టీఎంసీలకు సమానం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని