Crime News: చిన్నారులకు డాన్స్‌ నేర్పించాలని పిలిచి.. ఏడాదిగా మతపెద్ద అత్యాచారం
eenadu telugu news
Published : 26/09/2021 08:11 IST

Crime News: చిన్నారులకు డాన్స్‌ నేర్పించాలని పిలిచి.. ఏడాదిగా మతపెద్ద అత్యాచారం

పెదకూరపాడు, న్యూస్‌టుడే: చిన్నారులకు నృత్యాలు నేర్పించాలని పిలిచి యువతిపై మతపెద్ద అత్యాచారానికి పాల్పడిన ఉదంతమిది. ఏడాది నుంచి లైంగిక దాడికి పాల్పడుతున్న అతనిని బాధితురాలు వివాహం చేసుకోవాలని కోరగా మొహం చాటేయడంతో పోలీసులను ఆశ్రయించారు. పెదకూరపాడు ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు మండలానికి చెందిన యువతి గుంటూరులోని ఒక మార్ట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో పండగ కోసం స్వస్థలానికి వచ్చారు. గ్రామంలో మతపెద్దగా వ్యవహరిస్తున్న మాయకుంట్ల బాలస్వామి చిన్నారులకు భక్తిగీతాలకు నృత్యాలు నేర్పించాలని ఆమెను పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఉంటే జీవింతాంతం ఏ బాధలు లేకుండా చూసుకుంటానని చెబుతూ ఏడాదిగా సహజీవనం సాగిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని కోరితే నిరాకరించాడని, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై శుక్రవారం రాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఆమెను శనివారం గుంటూరు జీజీహెచ్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. బాధితురాలిని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు, సీఐ గుంజి తిరుమలరావు కలిసి వివరాలు ఆరా తీశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని