రైతు బలవన్మరణం
eenadu telugu news
Published : 26/09/2021 04:21 IST

రైతు బలవన్మరణం


శ్రీను (పాత చిత్రం)

పెదకూరపాడు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు కత్తుల శ్రీను (32) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న 70 సెంట్ల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి పెరగడం, వైరస్‌ సోకి ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడంతో మూడేళ్లలో రూ.ఏడు లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. పైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగిపోవడం, భార్య బంగారు ఆభరణాలు వేలానికి రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యంలో పురుగుమందు కలుపుకొని తాగాడు. స్థానికులు గమనించి అమరావతి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని సోదరుడు గోపి అమరావతి పోలీసుస్టేషన్‌లో ఈమేరకు ఫిర్యాదు చేశాడు. శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని