చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
eenadu telugu news
Published : 26/09/2021 07:08 IST

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

 

పట్నంబజారు, న్యూస్‌టుడే : ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి యువకులను శనివారం పాతగుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తూర్పు డీఎస్పీ సీతారామయ్య వివరాలు వెల్లడించారు. మంగళ్‌దాస్‌నగర్‌కు చెందిన కొమ్ము సుమంత ఈనెల 12న బంగారపు ఆభరణాలను ఇంటిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా గుర్తు తెలియని యువకులు ఆమె ఇంటిలోకి ప్రవేశించి బంగారపు ఆభరణాలు చోరీ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీఐ వాసు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరువారితోటకు చెందిన మైనర్‌, నెహ్రూనగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, సీతానగర్‌కు చెందిన మహమ్మద్‌ నాగూర్‌లు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.45 లక్షలు విలువైన బంగారపు ఆభరణాలు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, రెండు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల్లోని మైనర్‌పై గతంలో నగరంపాలెం పోలీసుస్టేషన్‌ పరిధిలో మూడు చోరీ కేసులు, కొత్తపేట పోలీసుస్టేషన్‌ పరిధిలో మూడు కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని