AP News: సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించాలి: అనగాని సత్యప్రసాద్‌
eenadu telugu news
Updated : 26/09/2021 12:19 IST

AP News: సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించాలి: అనగాని సత్యప్రసాద్‌

రేపల్లె: ఏపీలో వైకాపా ప్రభుత్వం సీఎం సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌)ని నిలిపేయడం బాధాకరమని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. కరోనా సమయంలో సీఎం సహాయనిధి ద్వారా సాయం అందక పేదల ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారన్నారు. కరోనా సాయం కింద సీఎం సహాయనిధికి వచ్చిన విరాళాలను పేదల వైద్యానికి వినియోగించాలని లేఖలో కోరారు. ఎమ్మెల్యేలు ఇస్తున్న లేఖలను సీఎం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే సీఎంఆర్‌ఎఫ్‌ను పునరుద్ధరించి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని